బెర్తులు ఉండే వందే భారత్ రైళ్లను గంటకు 220 కి.మీ వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని.. అవి పట్టాలపై 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు గురువారం వెల్లడించారు. సీట్లు ఉండే వందే భారత్ లు.. శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లకు ప్రత్యామ్నాయం అయితే.. బెర్తులుండే వందే భారత్ లు రాజధాని ఎక్స్ ప్రెస్ లకు ప్రత్యామ్నాయం అని తెలిపారు. ఇది దశల వారీగా జరుగుతుందని వెల్లడించారు.