బాల్య వివాహాల కట్టడిపై జిల్లాల అధికారులకు ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వరుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు. 18 ఏళ్లలోపు బాలికను పెళ్లి చేసుకుని సంసారం చేస్తే పదేళ్ల జైలుశిక్ష, 16 ఏళ్లలోపు బాలికను పెళ్లి చేసుకుని సంసారం చేస్తే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.పెళ్లి చేసిన పేరెంట్స్ కి కూడా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు.