కేరళలో ఓ వ్యక్తికి రూ.16 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా లాటరీ టిక్కెట్ కొన్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఆధ్వర్యంలో గురువారం లాటరీ డ్రా తీశారు. మధుసూదనన్ అనే లాటరీ షాపు నిర్వాహకుడు టిక్కెట్ నెంబర్ XD 236433ను అమ్మగా దానికి బహుమతి లభించింది. అయితే ఇది కొన్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు.