ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దుమారం రేపుతోంది. 2 భాగాలుగా దీన్ని రిలీజ్ చేసిన బీబీసీ.. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి సీఎంగా ఉన్న మోదీ పాత్రపై విమర్శలు గుప్పించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డాక్యుమెంటరీ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్యుమెంటరీపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందిస్తూ.. ‘తాము ఎలాంటి హింసను సంహించబోం’ అని అన్నారు.