హెల్మెట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని అంతర్జాతీయ రహదారుల సమాఖ్య (ఐఆర్ఎఫ్) కేంద్రానికి సూచిస్తూ లేఖ రాసింది. దీని ద్వారా హెల్మెట్లు తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చి, ఎక్కువ మంది వాహనదారులు ధరిస్తారని అభిప్రాయపడింది. కాగా, ఐఆర్ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్ని పర్యవేక్షిస్తూ ప్రభుత్వాలకు పలు సూచనలిస్తూ తగిన నివేదికలు రూపొందిస్తుంది.