ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన బాలికను ఓ యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. ఆ యువకుడు తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్లేవాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయితీ చేశారు. పంచాయతీ పెద్దలు బాలికకు యువకుడి చేత పసుపుతాడు కట్టించారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని బాలికను విచారించారు. బాలికను చైల్డ్ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa