రెండు, మూడు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కొన్ని చుక్కలను తీసుకుని ముక్కు రంధ్రాల్లో వేస్తే ముక్కులోని శ్లేష్మం కరుగుతుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. వెల్లుల్లి రెబ్బల్ని పేస్ట్‌లా చేసి గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఉల్లిపాయలను కట్ చేసి వాసన పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.