యూపీ ముజఫర్ నగర్ లో 1990, ఏప్రిల్ 21 (33 ఏళ్ల క్రితం) హర్బిత్ సింగ్ అనే వ్యక్తి కల్తీ పాలు అమ్ముతున్నాడని ఫుడ్ ఇన్ స్పెక్టర్ సురేశ్ చంద్ అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం అన్ని ఆధారాలు పరిశీలించింది. గురువారం ఆ పాల వ్యాపారికి 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.