బుక్కరాయసముద్రం మండలంలో శుక్రవారం పూసల సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఏకమై వెనుకబడిన కులాల అభివృద్దికి కృషి చేయాలని కోరారు. పూసల సంఘంని ఏస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభివృద్దికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూసల హనుమంతు, మండల అధ్యక్షులు పూసల కోమిటి, ఉపాధ్యక్షులు శేషు, పూసల సంఘం నాయకులు పాల్గొన్నారు.