తాడిపత్రి పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం మహాధర్నా పోస్టర్లను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి ఇంచార్జ్ రాజారెడ్డి హాజరై వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య , టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగిందని అయితే జగనన్న కాలనీలో నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏ మాత్రం కల్పించలేదు అని అందువలన లబ్ధిదారులు తీవ్రమైన సామాగ్రి ధరలు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక, కంకర, కిటికీలు, తలుపులు, ధరలు పెరగడంతో పాటు కూలీల ధరలు కూడా బాగా పెరిగాయి అని పెరిగిన ధరలకు అనుగుణంగా జగనన్న ఇంటి నిర్మాణానికి ఇస్తున్న ప్రభుత్వం 1, 80, 000/- రూపాయలు ఎక్కడ సరిపోవని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, బాధితులు పక్షాన సిపిఐ పోరుబాట భాగంగా ఈనెల 17 నుంచి 30 తేదీ వరకు జగనన్న ఇంటి లబ్ధిదారులతో సంతకాల సేకరణ, 30న బాధితులతో మండల , నియోజకవర్గాల, కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం. వచ్చేనెల 6" తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సహాయ కార్యదర్శి రామంజి, మండల కార్యదర్శి. నాగరంగయ్య, సదక్ వలి, రత్నంయ్య, నాగేంద్ర, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.