తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని యాడికి మండలం రాయలచెరువులో రైతు మసూద్ వలి నుంచి గుర్తుతెలియని వ్యక్తి నగదు అపహరించడంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామని శుక్రవారం సీఐ రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కందులు విక్రయించడానికి వచ్చిన రైతు మసూదావలి నుంచి గుర్తు తెలియని వ్యక్తి రూ. 17500 నగదు అపహరించాడని, బాధితుడి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.