గుజరాత్ లోని సూరత్ కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం బంగారంతో ప్రధాని మోడీ ప్రతిమను తయారు చేశారు. మోదీపై ఉన్న అభిమానంతో బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని చేసేందుకు రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. దీనిని తమ బృందంలోని 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించి తయారు చేశారని సందీప్‌జైన్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రధానిని కలిసి దీనిని ఆయనకు బహూకరిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa