పేదల ఇళ్ల నిర్మాణం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వా ల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సీపీఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా కర్నూల్ జిల్లా, పత్తికొండ, ఆదోని రోడ్డులో ఉన్న జగనన్న కాలనీని సీపీఐ బృందం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీల్లో మౌలిక వసతులను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య అధికంగా ఉందని లబ్ధిదారులు బృందం నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు రాజాసాహెబ్, రామాంజి నేయులు, ప్రజాసంఘాల నాయకులు కారన్న, కృష్ణ, వీరన్న, నెట్టికంటయ్య, ఎంకె సుంకన్న, పులికొండ తదితరులు పాల్గొన్నారు.