ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది తీరు చర్చనీయాంశం అయ్యింది. ఆఫీస్ గదిలోనే మందు పార్టీ చేసుకున్నారు అక్కడి సిబ్బంది. యార్డ్ అసిస్టెంట్‌లు పీర్ సాహెబ్, నాగరాజు మందేసి.. విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఇద్దరు కలిసి రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. అటు.. పీర్ సాహెబ్, నాగరాజు ఆఫీస్ గదిలో మద్యం సేవిస్తుండగా.. రైతు (Farmer) తన ఫోన్‌లో వీడియో తీశారు. దాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు పంపినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa