పుదుచ్చేరి స్త్రీ, శిశు సంక్షేమశాఖ పింఛన్లు మంజూరు చేస్తూ విడుదలైన ఉత్తర్వులతో యానాంలో 600 మందికి లబ్ధి చేకూరనుందని ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. జనవరి 8న ప్రజా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంకు పించన్లు తదితర సమస్యలపై వినతిపత్రం ఇచ్చామని మల్లాడి గుర్తుచేశారు. యానాంలో 4, 430 మంది పింఛన్ల లబ్దిదారులుండగా కొత్తగా ఇచ్చే వాటితో ఆ సంఖ్య 5, 030కి పెరగనుంది. సీఎం ఎన్. రంగసామి, ఎల్జీ తమిళిసై, మంత్రి జయకుమార్లకు మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు.