సాధారణంగా నిద్రపోయే ముందు లేదా అలసటగా అనిపించినపుడు, పనిచేయాలని అనిపించక పోయినా, నీరసంగా ఉన్నపుడు ఆవులింతలు వస్తాయి. అయితే తరచుగా ఆవులిస్తుంటే అది అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉండటం. స్ట్రోక్, పార్కిన్సన్స్, కాలేయ వైఫల్యం, మూర్ఛ లేదా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆవులించడం జరుగుతుందట.