న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ప్రధాని అభ్యర్థిపై లేబర్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. జెసిండా స్థానంలో ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ను నామినేట్ చేసినట్లు వెల్లడించింది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీకి చెందిన 64 మంది చట్టసభ్యులు ఓటింగ్ ద్వారా హిప్కిన్స్ ను ఎన్నుకోనున్నారు. హిప్కిన్స్ ప్రస్తుతం పోలీస్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.