గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ అపార్ట్మెంట్లో కొన్నాళ్లుగా అనిల్ బాధేల్, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్లాక వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. భర్తపై కోపంతో అనిత తన చేతిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తితో అనిల్‌పై దాడికి దిగింది. దీంతో క్షణికావేశంలో భార్యను గొంతు కోసి చంపేశాడు అనిల్. తర్వాత ఫ్లాట్‌కు నిప్పు పెట్టాడు. మంటల వ్యాప్తితో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.