మన మున్సిపాటి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పురపాలక కౌన్సిల్ సభ్యులు వీరవరపు పేటలో శుక్రవారం పర్యటించారు. ఏలూరి బాలు, పామర్తి మహేష్, పూలి సత్యనారాయణ బొడపాటి శ్రీను, అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి, తదితరులు ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు , ఇంటి స్థలాలు, పారిశుధ్యం మెరుగుపరచాలని స్థానికులు కోరారు.