స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షను మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)-2022 పరీక్ష నుండే అమలు చేయనున్నట్లు తెలిపింది. హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.