బహిరంగ మూత్ర విసర్జన జనావాసాల్లో ఇదొక తీవ్ర సమస్య. దీనిని కట్టడి చేసేందుకు గ్రేటర్ లండన్ పరిధి వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంబిస్తోంది. ఇక్కడి సోహో ప్రాంతంలోని ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లోని బయటి గోడలపై నీటిని చిమ్మే పారదర్శక పెయింట్‌ను స్ప్రే చేస్తోంది. ఈ పూతగల ఉపరితలాలపై నీళ్లు పడినప్పుడు వెంటనే వెనక్కు చిమ్ముతుంది.