జీన్స్ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్ టన్నుల మైక్రోఫైబర్లు ఏటా సముద్రాల్లోకి చేరి నీటిని విషపూరితంగా మారుస్తున్నాయి. దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న రంగులు నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. ఫ్యాషన్ పరిశ్రమ 20% కలుషిత నీరు, 10% కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. దుస్తులను కొద్ది రోజులకే వాడిపడేయటం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.