అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయింది. తెల్లవారుజామున 3:39 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 600 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని, కార్డోబాకు 517 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.