పర్చూరు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ శనివారం నియోజకవర్గం పరిధిలోని సాగర్ కాలవల మీద పర్యటించనున్నారు. బొల్లాపల్లి నాగార్జునసాగర్ కాలువ నుండి నూతలపాడు మైనర్ వరకు ఆయన పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి ఆమంచి కృషి చేస్తారని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరు కావాలని కోరింది.