రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్లో దించారు. ఈ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ విమానం గోవా విమానాశ్రయంలో 4.15 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు మెయిల్ రావడంతో దారి మళ్లించారు.