ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా సిద్ధవటం యానాదయ్య నియమితులయ్యారని నంద్యాల నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లుగాల్ల సుబ్బారాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరు రెండవ సారి ఎన్నికవడం పట్ల నాయి బ్రాహ్మణుల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటు 11 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్లకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.