బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఏ. శివారెడ్డి దక్షిణ భారత సాంకేతిక విద్యాలయాల స్థాయిలో కాకినాడలో జరిగిన ఖోఖోటోర్నీలో ప్రతిభ కనబరిచి ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికయ్యారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి నుండి 78 జట్లు పాల్గొన్నాయి. కాకినాడ జేఎన్టీయూ జట్టుకు ప్రాతినిధ్యమైన శివారెడ్డి తుదిపోరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టును మట్టి కరిపించారు. దీంతో ప్రథమ స్థానం కాకినాడ జేఎన్టీయూకు దక్కగా టోర్నీ మొత్తానికి ఉత్తమ ఆటగానిగా శివారెడ్డి ఎంపికయ్యారు మీరట్ లో ఫిబ్రవరిలో జరిగే అఖిల భారత స్థాయి ఖోఖో పోటీల్లో కూడా ఆయన పాల్గొంటారు ఈ సందర్భంగా తమ విద్యార్థి అయిన శివారెడ్డి, జట్టులో ఉండి ఆయనకు తోడ్పాటు అందించిన మరో విద్యార్థి ఏడుకొండల రెడ్డిలను శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పొగడ దండ రవికుమార్, ఇతర అధ్యాపక బృందం అభినందించింది.