గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో అనీమియాను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని ముఖ్యమంత్రి సలహాదారు సమీర్‌శర్మ పిలుపునిచ్చారు. అందుకు అధికా రులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. కృష్ణా జిల్లా, కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సుస్థిరాభివృద్ధికి లక్ష్యాల ఎనిమిది ప్రధాన సూచికల్లో జిల్లా ప్రగతిపై శుక్రవారం సమీర్ శర్మ సమీక్ష నిర్వహించారు. మండలాలు, సచివాయాలవారీగా గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో ఎంతమంది అనీమియా బాధితులున్నారని అడిగి తెలుసుకు న్నారు. జగనన్న గోరుముద్ద, బాలామృతం, అనీమియా నివారణకు తీసు కుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న పోషకాహారంపై ఆయన ఆరా తీశారు.