ఏపీఎ్సఆర్టీసీలోని అపరిష్కృత సమస్యలపై ఉద్యమబాట పట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఈయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా సమరశంఖం పూరించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు, నాలుగు జోన్ల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరైన ఈ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్లో ఈయూ 27వ రాష్ట్ర మహాసభలను జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.