విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 23 రైసుమిల్లులపై చర్యలు తీసుకున్నట్లు సివిల్ సప్లయిస్ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వ ప్రవేశపెట్టిన నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో రుజువు కావడంతో ఆయా మిల్లులపై చర్యలు తీసుకున్నామని శుక్రవారం చెప్పారు.