గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మోడల్ కో-ఆపరేటివ్ విలేజ్ ప్రోగ్రామ్‌కు నాగాయలంక మండలం ఎంపికైంది. ఈనెల 28న నాగాయలంకలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు, నాబార్డు చైర్మన్ కేవీ షాజీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. నాగాయలంకలో వారు పర్యటించి నాబార్డు సహకారంతో పలువురికి రుణాలను అందజేయనున్నారు. భారత ప్రభుత్వం సహకార్ సే సమృద్ధి పథకంలో భాగంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడున్న ప్రజ లకు కో-ఆపరేటివ్ సంస్థ ద్వారా వారికి రుణాలను అంద జేస్తారు. మోడల్ కో-ఆపరేటివ్ విలేజ్ ప్రోగ్రామ్‌ను గతేడాది ఏప్రిల్‌లో గుజరాత్‌లో అమిత్ షా సొంత నియోజకవర్గంలో ప్రారంభించారు. అది సత్ఫలితాలు ఇవ్వటంతో దేశవ్యాప్తంగా మరికొన్ని సహకార గ్రామా లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల ప్రజల అవసరాలను నాబార్డుకు వివరించి ఆ కార్యక్రమానికి నాగాయలంక మండలాన్ని ఎంపిక చేయించారు.