కృష్ణా జిల్లా, గుడివాడ రూరల్ మండలం శేరిదింటకుర్రు గ్రామానికి చెందిన మధులత(6) గురువారం సాయంత్రం ప్రహరీ దగ్గర ఆడుకుంటుండగా, గోడ కూలి మృతి చెందింది. తల్లి దండ్రులు బాపట్ల రామకృష్ణ - బాపట్ల కృష్ణవేణి, బంధువులు గమనించి శిథిలాలను తొలగించారు. గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే మధులత మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి ప్రైమరీ అంగన్వాడీలో చదివి ఇంటికి వచ్చి ఆడుకుంటుంగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, గ్రామస్థులు భోరున విలపించారు.