కరోనా వ్యాప్తి తగ్గినా దానికి చెందిన అనేక వేరియెంట్లు విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఒమిక్రాన్ తాలూకు మరో సబ్–వేరియెంట్ అయిన XBB 1.5 అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. అనేకమంది ఈవేరియంట్ బారిన పడుతున్నారు ఈ పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ వేరియంట్ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలతో పాటు మన దేశానికి పాకే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.