మహిళలు, బాలికలను అనుమతి లేకుండా తాకకూడదని, ఈ పాఠాలను పాఠశాల స్థాయిలోనే బాలురకు నేర్పాలని కేరళ హైకోర్టు పేర్కొంది. సత్ప్రవర్తన, మర్యాదలను ప్రాథమిక స్థాయిలోనే నేర్పించాలన్నారు. లైంగిక వేధింపుల కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అమ్మాయి వద్దు అని చెప్పిందంటే దానికి అర్థం వద్దు అని స్పష్టంగా పురుషులు అర్థం చేసుకోవాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ తెలిపారు.