కెమికల్ ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పానిపట్ లో శనివారం రోజు కెమికల్ ట్యాంకర్ కు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దుకాణం పైకప్పు సైతం పూర్తిగా దెబ్బతింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa