సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమి మీద సంచరించిన డైనోసార్‌ల గుడ్లు, గూళ్లను గుర్తించినట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం శిలాజ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్‌ల 256 గుడ్లు, పలు గూళ్లు బయటపడ్డాయి. అయితే ఇక్కడ వీటి నివాసాలు బాగా దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.