తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాకు చెందిన ఫిర్దోస్ (22)కు అబ్దుల్లాతో గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. ఫిర్దోస్ ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈనెల 2న చిన్నారితో కలిసి భర్త ఇంటికి వెళ్లిన ఫిర్దోస్,17న తిరిగివచ్చేసింది. ఈక్రమంలో శుక్రవారం చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.