వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో 39, 40 బూత్ లలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరాచకపు వైసిపి పాలనలో నిత్యవసర వస్తువుల నుండి ప్రతి దానిపై ప్రజలు మోయలేని భారం వేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ పాలన పై విసుగుచెంది ఉన్నారని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన మార్కాపురం జిల్లా విషయంలో వైసిపి నాయకులు తీవ్ర ద్రోహం చేశారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తద్యమని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రజలతో అన్నారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డునకు చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో తానిగుండాల నారాయణరెడ్డి ( కాంట్రాక్టర్), తానిగుండాల శ్రీకాంత్ రెడ్డి, తానిగుండాల శ్రీధర్ రెడ్డి, కామమురి తిరుపతి రెడ్డి, సుహాసిని, కొర్రపోలు నారాయణరెడ్డి, కొర్రపోలు లక్ష్మమ్మ, కొర్రపోలు హనుమంత రెడ్డి, కొర్రపోలు శ్రీనివాసరెడ్డి, కొర్రపోలు సౌజన్య, కొర్రపోలు రామసుబ్బమ్మ మరియు మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, 9వ వార్డు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.