తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం నమోదైంది. ధర్మపురిలో నిర్వహించిన జల్లికట్టును చూసేందుకు వెళ్లిన గోకుల్ అనే 14 బాలుడిని ఎద్దు పొడవడంతో అతడి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి తరలించే లోపే చిన్నారి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాలుడి మరణంతో జల్లికట్టు వల్ల మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది.