అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర జరుగుతోంది. జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని హిరనగర్ నుంచి యాత్ర సాగుతోంది. ఈ యాత్ర జరుగుతున్న ప్రదేశం పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండడంతో పోలీసులు జమ్ము-పఠాన్ కోట్ హైవేను మూసివేశారు. శనివారం జమ్ముకశ్మీర్ లో 3 చోట్ల పేలుళ్లతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.