అమెరికాలోని కాలిఫోర్నియాలోని దారుణం జరిగింది. మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకకు వేలాదిగా ప్రజలు వచ్చారు. ఈ వేడుకలో దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa