చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. అయితే ఏమీ తినకముందే పొద్దున్నే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సి వచ్చినా కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. ఇలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాక, జీర్ణసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం గంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవాలి.