సముద్ర గర్భంలో తిరుగుతూ రకరకాల చేపలు, జీవులను చూస్తే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..?! విశాఖపట్నం వాసులకు ఇప్పుడు అలాంటి అనుభూతినే కల్పిస్తోంది ఈ ‘అండర్ వాటర్ టన్నెల్’ చుట్టూ నీరు, అందులో అందమైన చేపలు. అద్దాలతో ఏర్పాటు చేసిన టన్నెల్ లాంటి నిర్మాణంలో నడుస్తూ.. ఆ చేపలను చూస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు విశాఖ వాసులు. ఇప్పటివరకూ విదేశాలకే పరిమితమైన ‘అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్‌పో’ను ఇప్పుడు వైజాగ్ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బీచ్ రోడ్డులోని ఆంధ్రా యానివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వా ఎగ్జిబిషన్‌ను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇటీవలే ప్రారంభించారు.
ఈ టన్నెల్ అక్వేరియం సింగపూర్‌లో రూపుదిద్దుకుంది. దీనికి 4.5 కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యిందని అధికారులు తెలిపారు. భారత్‌కు తీసుకొచ్చిన ఈ టన్నెల్ అక్వేరియంను దేశంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. అక్కడ కొన్ని రోజులు ఉంచుతూ, సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు. తాజాగా ఈ అదృష్టం వైజాగ్ వాసులను వరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa