ఓ వ్యక్తి తన భార్యా పిల్లలను గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. రత్లాంలోని దీదీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో రైల్వేలే గ్యాంగ్ మెన్ గా పనిచేసే 33 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలపై గొడ్డలితో విచక్షణరహితంగా దాడి చేశాడు. వాళ్లు చనిపోయిన తర్వాత తన ఇంట్లోనే వారిని పాతిపెట్టాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని రత్లం ఎస్పీ తెలిపాడు.