రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫతేపూర్-సలాసర్ హైవేపై ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతిచెందిన వారిని హర్యానా వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని ఫతేపూర్ డీఎస్పీ రాజేశ్ కుమార్ విద్యార్థి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa