లఖ్‌నవూలోని రహీంనగర్‌లో ఉన్న అనోఖా మాల్లో దుస్తులు, అక్కడి వస్తువులన్నీ ఉచితం. ఆ మాల్లో పేదలకు అవసరమైన దుస్తులే ఉంటాయి. పేదవారి కోసం డా.అహ్మద్ రజాఖాన్ ఈ మాల్ పెట్టాడు. ఈ మాల్లో దాతలు అందించిన స్వెటర్లు, దుప్పట్లతోపాటు చెప్పులు, స్కూల్ యూనిఫాం తదితరాలను ఉంచుతారు. కార్మికులు, పేదలు వీటిని తీసుకెళ్లి ఉపయోగించుకుంటారు. సాయం కోసం అర్థించకుండా ఆత్మగౌరవంతో ఇక్కడి వస్తువులను ఉచితంగా తీసుకోవచ్చు.