భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తన ప్రేయసి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె అతియాశెట్టిని సోమవారం వివాహం చేసుకోనున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పూణేలోని లోనావాలాలో బంధువులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటవనుంది. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో ఈ వివాహ వేడుక జరుగనున్నట్లు సమాచారం. ఇక ఈ పెళ్లి వేడుకలో నో ఫోన్ పాలసీ అమలు కానున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా సునీల్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాహుల్.. అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలిసింది. హిందూ సంప్రాదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇక పెళ్లి అనంతరం ముంబయి వేదికగా గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దాదాపు 3 వేల మంది అతిథులతో ఈ రిసెప్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది.