ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా టెక్ దిగ్గజ కంపెనీలు జనవరి నెలలో సగటున ప్రతీరోజూ 3000 మంది ఉద్యోగులను తొలగిస్తుందని లేఆఫ్స్.FYI తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 166 ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఈ కోతలు మరింత పెరగనున్నాయి.