మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దుండగులు డ్రగ్స్ రవాణా కోసం వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మిజోరాంలో చోటుచేసుకుంది. కొలాసిబ్ జిల్లాలోని వైరెంగ్టే పోలీసులు ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ట్రక్కును తనిఖీ చేయగా 625 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ.3.4 కోట్లు ఉంటుందని, ట్రక్ డ్రైవర్ ను అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు.