పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. జైరాం గుప్తా అనే వ్యక్తి పానీ పూరీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. స్థానిక దుకాణంలో పని చేసే ఓ వ్యక్తి జైరాంకి రూ.20 బాకీ పడ్డాడు. మరుసటి రోజు పానీపూరీ తినడానికి వచ్చిన అతడిని డబ్బులు అడగ్గా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జైరాంను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.